తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం !

J.SURENDER KUMAR,


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణ ప్రధాన ముఖద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కు జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్ , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ , మహేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

👉 తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక ఆవిష్కరణ !

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

👉 ఎయిర్ ఫోర్స్  విన్యాసాలను తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి !

హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ గగనతలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్  విన్యాసాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  పలువురు మంత్రులతో కలిసి వీక్షించారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది.


తొమ్మిది జెట్ విమానాలతో నిర్వహించిన విన్యాసాలు సర్వత్రా నగర ప్రజలను అలరించాయి. ట్యాంక్‌బండ్ నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ విన్యాసాలను వీక్షించగా, ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్ రోడ్డు మార్గం, పరిసర ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.


ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు , మహమ్మద్ అలీ షబ్బీర్, వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు.