👉 జిల్లా విద్యాశాఖ అధికారి రాము !
J.SURENDER KUMAR,
త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ( విద్యార్థులను) చదువుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించి, వారికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కే రాము అన్నారు.

ఆహారోత్సవం లో భాగంగా ధర్మపురి పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన జగిత్యాల జిల్లా విద్యాశాఖ అధికారి రాము మాట్లాడుతూ..
విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల 100% ఫలితాలను సాధించాలని మార్గ నిర్దేశనం చేశారు.

పాఠశాలలో విద్యార్థులు స్వయంగా వండి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను రుచి చూసి తల్లిదండ్రులు తమ పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించాలని అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందు ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, మండల విద్యాధికారి శ్రీమతి సీతాలక్ష్మి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
👉పాఠశాలలో గ్రంథాలయ ప్రారంభం !

ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాన్ని విద్యాధికారి రాము ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయులు డా. గొల్లపల్లి గణేశ్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కి చెందిన వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ శ్రీ రేణుక దయానంద రెడ్డి ₹ 30 వేల రూపాయల విలువ గల పుస్తకాలు మరియు ఒక బీరువాను అందించారు

.
ఈ సందర్భంగా విద్యాధికారి దాతలను అభినందిస్తూ, విద్యార్థులు ఈ పుస్తకాల ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీమతి ఎస్. సీతలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు కాసర్ల నరసింహ మూర్తి, గొల్లపెల్లి గణేశ్, జ్యోతి, వంశి, రమేష్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
👉రాజారాం మండల పరిషత్ పాఠశాలలో.. ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు !

ధర్మపురి మండలం రాజారం గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శని వారం భారత జాతీయ గణిత శాస్త్ర పితా మహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకోని జాతీయ గణితదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమ నిర్వహణలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గణిత శాస్త్రనికి సంబందించిన క్విజ్ పోటీ లను నిర్వహించి విజేతలకు బహుమతుల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాధు శ్రీకాంత్, ఉపాధ్యాయ సిబ్బంది బండారి సతీష్ కుమార్, శ్రీమతి చుంచుకాల శ్వేత రాణి, చల్ల కృష్ణ లతో పాటు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.