తిరుమలలో టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు తనిఖీలు !


J.SURENDER KUMAR,


తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి గృహంలో బుధవారం టీటీడీ చైర్మన్  బీఆర్ నాయుడు దుకాణాలు, హాకర్ లైసెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు లైసెన్స్‌లను పరిశీలించి ఆక్రమణలు ఉంటే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

దుకాణాదారులు తమకు కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలని, నిబంధనలు పాటించి ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని, భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్టేట్ అధికారి  వెంకటేశ్వర్లు, విజిఓ  సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.