👉శ్రీవారిని 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు !
👉టీటీడీ ఈవో శ్యామలరావు !
J.SURENDER KUMAR,
నవంబర్ నెలలో దాదాపు 20.35 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నెలవారీ డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం శనివారం మీడియాతో మాట్లాడుతూ హుండీ విరాళాలు ₹111కోట్లు దాటాయని, మొత్తం లడ్డూలు పంపిణీ చేసిన మొత్తం 97లక్షలు అని అన్నారు.
సుమారు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించగా, తలనీలాలు సమర్పించిన వారు 7.31 లక్షల మంది ఉన్నారు.
అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఓ శ్రీమతి గౌతమి, సివిఎస్‌వో శ్రీధర్, సిఇ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
\