ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీలో అధికారిని నియమించిన మంత్రి జువ్వాడి !

👉 టీటీడీలో తెలంగాణ లైజన్ ఆఫీసర్ నియామకం !


J.SURENDER KUMAR,

దశాబ్దన్నర కాలం క్రితమే ఉమ్మడి రాష్ట్రంలోనే టీటీడీలో ప్రత్యేక అధికారిని అప్పటి దేవాదాయ శాఖ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు నియమించారు.


స్వయం ప్రతిపత్తి గల తిరుమల తిరుపతి దేవస్థానం లో కొందరు అధికారులు, తెలంగాణ చట్టసభల ప్రజా ప్రతినిధుల దర్శనం, సిఫారసు లేఖల పట్ల ఏదో మొక్కుబడిగా అనుమతించడం, గంటల తరబడి వసతి సౌకర్యాల కోసం సిఫారసు లేఖలతో భక్తులు వేచి ఉండే పరిస్థితి నాడు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కు అక్కడి పరిస్థితిని వివరించారు.

మాజీమంత్రి జువ్వాడ రత్నాకర్ రావు (ఫైల్ ఫోటో)

(2008-9) సంవత్సరంలో. స్పందించిన మంత్రి రత్నాకర్ రావు నాటి టీటీడీ ఈవో. జేఈవో ధర్మారెడ్డికి పరిస్థితిని వివరించారు. తిరుమలలో తక్షణం దేవాదాయ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యాలయంలో టీటీడీ లో విధులు నిర్వహించే అధికారి రామశర్మ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణ ప్రాంత చట్టసభల ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీలో దర్శనం వసతి సౌకర్యాల కల్పన కోసం నిబంధనల మేరకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. ప్రతివారం సిఫారసు లేఖల వివరాలు, మంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని జారీ చేసిన ఆదేశాల మేరకు సిఫారసు లేఖలకు ప్రాధాన్యత లభించింది.

👉 తెలంగాణ ప్రభుత్వం పక్షాన..

తిరుమలలో తెలంగాణ ప్రభుత్వ పక్షాన లైజన్ ఆఫీసర్ ( ఓ ఎస్ డి ) గణేష్ కుమార్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో గత రెండు రోజుల క్రితం నియమించింది. టీటీ డీ తో అనుసంధానంలో భాగంగా ఈ ఏర్పాటు చేసింది. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. ఆయన జీతభత్యాల ఖర్చును యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భరించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది