ఉత్తర ప్రదేశ్ లో మహా కుంభమేళాకు సర్వం సిద్ధం !

👉టిటిడి విస్తృత ఏర్పాట్లు !


J.SURENDER KUMAR,

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఆరోగ్య, విద్యాశాఖ జేఈవో శ్రీమతి గౌతమి అధికారులకు సూచించారు.

సుమారు 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో పాల్గొనే భక్తులకు టీటీడీ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జేఈవో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

👉 టీటీడీ ఈవో  జె శ్యామలరావు ఆదేశాల మేరకు ఉత్తరాది భక్తులకు మహాకుంభమేళాలోనే ఏడుకొండల స్వామి సన్నిధిని అనుభూతి చెందేలా శ్రీవేంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయాన్ని తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆమె ఆదేశించారు.

👉 శ్రీవారి కళ్యాణోత్సవం, చక్రస్నానం మొదలైన ధార్మిక కార్యక్రమాలు భక్తులను ముఖ్యంగా ఉత్తరాది భక్తులను ఆకట్టుకునేలా తగిన రీతిలో నిర్వహించాలని ఆమె కోరారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఆలయ వైభవాన్ని పెంచేందుకు విద్యుత్‌ దీపాలంకరణ, పూల అలంకరణలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

👉 టిటిడి విజిలెన్స్ మరియు భద్రతా అధికారులు యుపి పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. మహాకుంభమేళాకు సంబంధించి నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు, నిర్వహించే భజనలు, ప్రత్యేక రోజుల్లో ఎస్‌విబిసి ప్రత్యక్ష ప్రసారం చేయాలని, ప్రజాసంబంధాల విభాగం టిటిడిలోని వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు.

👉 తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు  వేణుగోపాల దీక్షితులు, హెచ్‌డిపిపి సెక్రటరీ  రఘునాథ్, డిపిపి ప్రోగ్రాం ఆఫీసర్  రాజగోపాల్, ఎస్ఇ 3 జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఇ (ఎలక్ట్రికల్)  వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇఓలు సెల్వం,  శివప్రసాద్, శ్రీమతి ప్రశాంతి, గుణభూషణ్ రెడ్డి. , AVSO  సతీష్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.