ఉత్తరప్రదేశ్ వాసి హత్య కేసులో నిందితుల రిమాండ్ !

👉 హత్య సంఘటన లో అంత గప్ చుప్ !

👉 పోలీసుల ప్రెస్ మీట్ లేదు ప్రెస్ నోట్ తో సమాచారం !


J.SURENDER KUMAR,

ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి నేరెళ్ల గ్రామ శివారులో జరిగిన ఉత్తరప్రదేశ్ వాసి హత్య కేసులో స్వచ్ఛందంగా లొంగిన నిందితులను ఆదివారం రిమాండ్ కు తరలించినట్టు ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

గత వారం రోజులుగా హత్య ఉదాంతం పై మండలంలో పలు రకాలుగా వదంతులు చెక్కర్లు కొడుతున్న శనివారం పోలీసులు జారీ చేసిన ప్రకటనతో హతుడు, ఉత్తరప్రదేశ్ వాసి అని, తాము హత్య చేశామంటూ లొంగిన ఇద్దరు ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి వారు అనే అంశం వెలుగు చూసింది.


సంఘటన స్థలాన్ని ఆదివారం జగిత్యాల DSP డి రఘుచందర్ సందర్శించారు. దర్యాప్తులో భాగంగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ రామ్ నర్సింహారెడ్డి, ధర్మపురి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పి ఉదయ్ కుమార్ మరియు బుగ్గారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీధర్ రెడ్డి మరియు ధర్మపురి పోలీస్ స్టేషన్ సిబ్బంది DSP వెంట ఉండి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసులో శవ పంచనామా ను ( ఎముకలు, బూడిది సేకరణ కోసం.) జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ సంఘటన స్థలంనికి చేరుకొని శవ పరిక్ష నిర్వహించడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. దర్యాప్తు లో భాగంగా నిందితులైన నేరెళ్ల గోపాల్ @ గోపాల్, గండికోట శేఖర్ లను కోర్ట్ యందు ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్టు ప్రకటనలో వివరించారు.

నిందితుల రిమాండ్ ప్రెస్ నోట్.

👉 మీడియాకు నో ఎంట్రీ..

వార్త సేకరణలో భాగంగా ఆదివారం మీడియా జర్నలిస్టులు సంఘటన స్థలానికి వెళ్లకుండా కిలోమీటర్ దూరంలోనే డిస్టిక్ గార్డు పోలీసులు అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులను వారికి చూపించిన అనుమతించలేదు. పోలీస్ అధికారికి ఫోన్ ద్వారా. అడ్డుకుంటున్న విషయాన్ని వివరించడంతో అధికారి ఆదేశాలతో సంఘటన స్థలానికి జర్నలిస్టులను అనుమతించారు.

👉 హతుడి వివరాలు గోప్యం !

తమను వేధించడం వల్లనే ఇక్కడికి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టామని పోలీసులకు చెప్పిన నిందితులు, హతుడి కుటుంబ సభ్యుల వివరాలు, ముంబైలో నివాస ప్రాంతం, ఫోన్ నెంబర్, వివరాలు వారు పోలీసులకు చెప్పి ఉంటారనేది చర్చ .

చిన్న చితక నేర పరిశోధన, నిందితుల అరెస్టు, రిమాండ్ సందర్భాలలో పోలీస్ శాఖ ఫోన్ కాల్ డాటా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నేరస్తులు పట్టుబడిన తీరు, నేరం జరిగిన తీరు, నేరం నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండి ఉంటే దాన్ని చేదించిన తీరు మీడియా సమావేశంలో పోలీస్ యంత్రాంగం గర్వంగా వివరించిన సందర్భాలు అనేకం. ఈ హత్య సంఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరు ? రెవెన్యూ, అటవీశాఖ అధికారులా ? తెలియాల్సి ఉంది.

👉 ఈ సంఘటనలో …

ఉత్తరప్రదేశ్ వాసి, ముంబైలో నివాసం, రాష్ట్రానికి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని అడవిలో దహనం చేసిన సంఘటన సంచలనమే. ఈ హత్య ఉదాంతం పై పోలీస్ యంత్రాంగం పత్రికా ప్రకటనలకే పరిమితమై గప్ చుప్ గా మారడం గమన హారం !