J.SURENDER KUMAR,
ఉమ్మడి సారంగాపూర్ మండలం రాయికల్ సారంగాపూర్ అటవీ ప్రాంతం వెన్నెముద్దల గండిలో రెండు దశాబ్దాల క్రితం నక్సల్స్ ప్లీనరీ సమావేశాలు బల్మూరి నారాయణరావు ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు తప్పించుకున్న నారాయణరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు.

ప్లీనరీ సమావేశ సమాచారం తెలిసిన జగిత్యాల డివిజన్ పోలీస్ యంత్రాంగం అప్పటి ఏ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు సారంగాపూర్ అడవులను జల్లడ పట్టాయి. ప్లీనరీ జరిగిన ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు కొన్ని రోజులపాటు గుట్ట కింద గ్రామాల్లో సానుభూతిపరుల ఇళ్లలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు.
ఓ ఇంటిలో ప్లీనరీ సమావేశాలకు. వినియోగించిన జనరేటర్, కరెంటు మోటార్,. పెట్రో మాక్స్ లైట్లు , వంట పాత్రలను పోలీసులు స్వాధీన పంచుకున్నారు.
1984 నుండి నక్సల్ సంస్థలో పార్టీ సభ్యునిగా చేరారు.

👉 1984 – 1994 వరకు అవిభక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు సంస్థలో క్రియాశీలకంగా ఉన్నారు
👉 బాలాఘాట్ ప్రాంతంలో (మధ్యప్రదేశ్) 1995 -1997 వరకు చురుకుగా పనిచేశాడు
👉 1998 -.2005 వరకు నార్త్ బస్తర్, కోయిలిబేరా ప్రాంతంలో చురుకుగా ఉన్నారు
👉 2005 – 2007 సంవత్సరానికి DKSZC సప్లై టీమ్ & అర్బన్ నెట్‌వర్క్ ఇన్చార్జిగా కొనసాగాడు.
👉 2007 – 2008 సంవత్సరంలో మన్పూర్-మొహాలా ప్రాంతంలో చురుకుగా పనిచేశాడు.
👉 సంవత్సరం 2008-2024 నుండి ఇప్పటి వరకు- DKSZC సరఫరా మరియు MOPOS (మొబైల్ పొలిటికల్ స్కూల్) ఇన్‌ఛార్జ్ గా పోలీసులకు పట్టుబడే వరకు కొనసాగుతున్నాడు.