J.SURENDER KUMAR,
అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన కుమారుడు హరిశ్వర్ కుమార్ నివాసంలో ( క్యాంపు కార్యాలయంలో) సోమవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి మహా పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది.

గూడెం అయ్యప్ప స్వామి వ్యవస్థాపకుడు గురు స్వామి చక్రవర్తి పురుషోత్తమాచార్యులు, ధర్మపురి క్షేత్ర గురుస్వామి పెండ్యాల బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో స్వామివారి పడి పూజను నిర్వహించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు , గడ్డం వంశీకృష్ణ పడిపూజ లో పాల్గొన్నారు.

వందలాది మంది అయ్యప్ప స్వాములు పూజలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, కె .లక్ష్మణ సాయి, ప్రముఖ గాయకుడు బండ్లపూడి రామ శర్మ, భక్తి గీతాలు భజన గానామృతం తో అయ్యప్పల భజనలతో, వేద మంత్రాల ఘోషలతో మార్మోగింది.

రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ మల్లయ్య అమ్మవారి వేషధారణతో చేసిన నృత్యం అలరించింది.

నియోజకవర్గంలోని మండలాల నుంచి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.

అయ్యప్ప పూజ తిలకించడానికి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.