వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టిక్కెట్లు 23 న విడుదల !

👉వైకుంఠ ఏకాదశి సందర్భంగా

J.SURENDER KUMAR,

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టిక్కెట్లు ఈనెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నది.

2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం జరగనున్నందున మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో  జె శ్యామలరావు, అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమావేశం నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. జేఈవో  వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్‌ పాల్గొన్నారు.

👉 వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు

👉 వైకుంఠ ద్వార దర్శనాల కోసం 23వ తేదీ ఉదయం 11 గంటలకు పది రోజుల పాటు శ్రీవాణి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

👉 పది రోజులకు సంబంధించిన SED టిక్కెట్లను డిసెంబర్ 24 ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు

👉 జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతిలో ఎనిమిది, తిరుమలలో ఒకటి చొప్పున ఎస్ఎస్‌డి టోకెన్ల కేటాయింపు.

👉 MR పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదాన్, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి గృహంలో SSD టోకెన్ల జారీ.

👉 టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు.

👉 టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. టోకెన్ లేని భక్తులను తిరుమలకు రావచ్చు కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు

👉 వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి.

👉 రద్దీ దృష్ట్యా వైకుంఠ ఏకాదశి నాడు ఆలయంలో వేదశీర్వచనం రద్దు

👉 వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం

👉 జనవరి 11న వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.

👉 గోవిందమాల భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం లేదు.

👉 వైకుంఠ ఏకాదశి నాడు టిటిడి భద్రతా సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

👉 ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు నిరంతరం అన్నప్రసాదం పంపిణీ చేయాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు.

👉 టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ.

👉 భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలి, దానికి అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచాలి.