అభిమానాన్ని మించిన హోదా లేదు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

👉జీవిత చివరి శ్వాస వరకు ప్రజలకు సేవలు అందిస్తా..అని జీవన్ రెడ్డి !


J.SURENDER KUMAR,


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 74వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపేందుకు ఆదివారం జిల్లా నలుమూలలా నుండి జీవన్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగిత్యాల పట్టణానికి తరలి వచ్చారు.
పట్టణం లో జీవన్ రెడ్డి జన్మదిన వేడుకల ఫ్లెక్సీలు రోడ్డుకు ఇరువైపులా.. హోర్డింగులతో నిండిపోయాయి. పూల బోకెలు అందజేసి..ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జీవన్ రెడ్డి అభిమానులు కేకులు కట్ చేసి, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో మాజీ మంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి 74 వ జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి ఇంటికి తరలివచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. జీవన్ రెడ్డి జన్మ దిన వేడుకల్లో పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఉంటామాని, జీవన్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ముక్తకంఠంతో నిందించారు.

జీవన్ రెడ్డి తన జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జంబి గద్దె హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీ కోదండ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో, మార్కండేయ దేవాలయంలో జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
జీవన్ రెడ్డి జిందాబాద్.. జై జీవన్..జై జై జీవన్ అంటూ నినాదాలు చేశారు.

జీవన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
జీవన్ రెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసీ, జీవన్ రెడ్డి పై తమ అభిమానం చాటుకున్నారు.

👉 74 కిలోల కేకు తో అభిమాని..

మోతే మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి జీవన్ రెడ్డి 74 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని 74 కిలోల భారీ కేకు తీసుకురాగా, అభిమానులు, కార్యకర్తలు, నాయకుల మధ్య జీవన్ రెడ్డి కట్ చేశారు. శాంతి కపోతాలను ఎగురవేశారు.

👉 గజమాలతో సత్కారం..

జీవన్ రెడ్డి 74 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రజనీ కాంత్ భారీ గజమాల తీసుకు రాగా, క్రేన్ సాయం తో భారీ గజ మాలతో, అభిమానుల కేరింతలు, డీ జీ పాటల మధ్య జీవన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించారు.

👉 ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

జగిత్యాల అంటే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా అభివృద్ధి చేసిన.
వ్యవసాయ కలశాల, న్యా క్ శిక్షణ కేంద్రం, మహిళా డిగ్రీ కలశాల, జేఎంటీయు ఇంజినీరింగ్ కలశాల ఏర్పాటు చేసిన. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములను కంచేలా పరిరక్షిస్తే నేడు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించినారు.

దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించిన. జగిత్యాల జిల్లా లోని ప్రతి పల్లె పల్లె కు తారు రోడ్డు వేసిన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిత్యం తాగు నీరు అందించిన ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల నిలిపాను.

నిరుపేదలకు అండగా నిలిచేందుకు తోపుడు బండ్లు, కూరగాయల వ్యాపారులకు తై బజార్ చిట్టి రద్దు చేయించిన. కమ్మునూరు కలమడుగు వంతెన నిర్మాణం చేసిన.

సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేల అభివృద్ధి చేసిన. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నాం.

సీఎం రేవంత్ రెడ్డి ఏవిధమైన ఆంక్షలు, పరిమితి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 12000 అందజేస్తున్నాం.
భూమి లేని వ్యవసాయ కూలీలకు ₹12000/- అందజేస్తున్నాం.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా అమలు చేస్తున్నాం.

గృహ అవసరాలకు కూడా భారం లేకుండా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం.

సిలిండర్ పై పెరిగిన ధరలు నిరుపేదల పై భారం లేకుండా కేవలం ₹ 500 లకే అందిస్తున్నాం.

రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెరవేయాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉంది.

కార్యకర్తల అండదండలు.. ప్రజాభిమానాన్ని మించిన హోదాలు ఏవి లేవు..

శాసన మండలి లో ప్రతి అంశం పై మాట్లాడిన.. ప్రజల పక్షాన నిలిచి.. ప్రభుత్వాన్ని నిలదీసిన..
మతతత్వ శక్తులను నిలువరించేందుకు నిజామాబాద్ ఏం పీ ఎన్నికల్లో పోటీ చేసిన.

ప్రజా సమస్యే నా సమస్యగా భావించి, వారికి అండగా నిలువడమే నా జీవిత ధ్యేయం అని అన్నారు.

ఏ హోదా లో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి, సేవలు అందిస్తాను.

నా జీవిత చివరి శ్వాస వరకు ప్రజలకు సేవలు అందిస్తా..అని జీవన్ రెడ్డి అన్నారు.