అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


కాటారం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మంగళవారం భూమి పూజ చేశారు.


₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు, అదేవిధంగా శ్రీపాద కాలనీలో ₹ 10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు, శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల నుండి సినిమా హాలు వరకు ₹10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు, వివేకానంద పాఠశాల నుండి అయ్యప్ప గుడి వరకు ₹ 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ పనులు ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉంటాయని, పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.


ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


👉 అగ్గుమహారాజ్ ను కలిసిన ప్రభుత్వ విప్..


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అమ్దాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశ్రమంలో నీ అగ్గుమహారాజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్


👉 బస్టాండ్ ప్రారంభం..


మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు నూతన బస్టాండ్ ను ప్రారంభించారు. కీర్తిశేషులు గూడెల్లి వీరేశం జ్ఞాపకార్ధంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతన బస్టాండ్ ను నిర్మించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వీరేశం సతీమణిని మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు

*