ఆలయ అర్చకులు అధికారులు సాంప్రదాయాలు పాటించాలి!

👉 దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి !

👉 ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 10 న జరగనున్న ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాలను ఆలయ అర్చకులు అధికారులు సమయపాలన పాటిస్తూ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శన ఉత్సవాల సందర్భంగా మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ , మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో మాదిరిగా ప్రముఖుల, రాక కోసం ఎదురు చూడడం, భక్తులకు ఇబ్బందులు కలిగించడం లాంటి చర్యలు పునరావతం కావద్దని ఎమ్మెల్యే అన్నారు.

వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు, అనుగుణంగా స్వామివారి వైకుంఠ ద్వారాలను తెరవాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆలయ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి తో కార్యాచరణ చేపట్టాలన్నారు.

ముందుగా దేవాలయంలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి, అన్నదాన, మరియు దర్శన టికెట్ల కౌంటర్లను ప్రారంభించారు .
సమీక్ష సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు