ఏపీ సీఎం బాబు కు తిరుమల శ్రీవారి ప్రసాదం !

J.SURENDER KUMAR,

నూతన సంవత్సరాన్ని 2025  పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి  ఎన్‌.చంద్రబాబు నాయుడు బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ప్రసాదాలను అందించారు.

టీటీడీ ఈవో  జె శ్యామలరావు, ఆలయానికి చెందిన వేద పండితుల బృందంతో కలిసి ఉండవల్లిలోని సీఎం బాబు  నివాసంలో  లాంఛనంగా కలుసుకుని  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీటీడీకి చెందిన వేదపండితుల బృందం సీఎంకు వేదశీర్వచనం అందించి అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ 2025 అందజేశారు.