ఆయన వద్దు – ఎవరైనా ముద్దు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ?

J.SURENDER KUMAR,


కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఆయన మాత్రం వద్దు ఎవరైనా సరే అంటూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం.


విశ్వసనీయ సమాచారం మేరకు దావోస్ పర్యటనకు ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో, రాష్ట్ర మంత్రులు కొందరు, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి తదితరులు నామినేటెడ్ పదవుల భర్తీ, ఆరు మంత్రి పదవుల భర్తీ, చేరికలు, ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.


ఈ సందర్భంలో ప్రత్యేకంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓ అభ్యర్థి పేరును ఢిల్లీ స్థాయి నాయకుడు వివరిస్తూ ఎలా ఉంటుందని అడిగినట్టు సమాచారం. అక్కడే ఉన్న రాష్ట్రస్థాయి కీలక నాయకుడు ఈయన అభ్యర్థిత్వం పై నెల రోజుల క్రితమే చర్చకు వచ్చింది అన్న , కొందరు ఎమ్మెల్యేలు ” అన్నా గతంలో మా ఫోన్ లు ఎత్తలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏదైనా ఉంటే ఆయన వ్యక్తిగత సహాయకులతో మాట్లాడాలని సమాచారం ఇచ్చేవాడు అంటూ తమ ముందు అయిష్టతను వ్యక్తం చేసినట్టు ఆ నాయకుడు సమావేశంలో ఆన్నట్టు తెలిసింది.

మన ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, ఆ అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా, క్యాడర్ మాత్రం సహకరిస్తుందనే నమ్మకం లేదన్నట్టు.


దీనికి తోడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు లో సామాజిక వర్గం, ప్రస్తుతం గతంలో ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడో, తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ. కరీంనగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానంపై ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్టు తెలిసింది.