J.SURENDER KUMAR,
రాజస్థాన్ లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం చాదర్‌ను సమర్పించారు.
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్‌ను ముస్లిం మతపెద్దల ముందు ప్రదర్శించి ప్రార్థనలు చేసిన అనంతరం సంప్రదాయ బద్ధంగా సాగనంపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ తో పాటు పలువురు ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
👉 యాదగిరిగుట్టకు సీఎంకు ఆహ్వానం !

యాదగిరిగుట్ట శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆహ్వానించారు.
ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరగనుంది. యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు.