J.SURENDER KUMAR,
రాష్ట్రానికి పెట్టుబడును తేవడానికి రెండు దేశాల పర్యటన నిమిత్తం సింగపూర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా సింగపూర్ లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన వారితో విమానాశ్రయంలో సందడి నెలకొంది.

మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి సింగపూర్ చేరుకోగానే అక్కడి తెలంగాణ పౌరులు కొందరు ముఖ్యమంత్రి బృందానికి ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు.
👉సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు !

తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండు దేశాల పర్యటన శుభారంభమైంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో విస్తృత చర్చలు జరిపింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధనం, స్థిరమైన హరిత ఇంధనం, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, IT పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం, దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు.