J.SURENDER KUMAR,
ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు తిరుపతి, నియోజకవర్గ NSUI అధ్యక్షుడు అప్పం శ్రవణ్ ఆధ్వర్యంలో ధర్మపురి మండలంలోని అఖిల భారత విద్య పరిషత్ (ABVP) కి చెందిన సుమారు 40 మందికి పైగా యువత సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
👉పరామర్శ ..

ధర్మారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లావుడ్య రూప్ల నాయక్ తండ్రి ఇటీవల మృతి చెందారు. సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు.
👉సింగిల్ విండో ఏర్పాటు చేయండి !

గొల్లపెల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో PACS సోసైటీని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.
అనంతరం మున్నూరు కాపు కులసంఘా భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూరు కాపు సంఘా కులస్తులు ఎమ్మెల్యే కు వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు