కాంగ్రెస్ శ్రేణులు డిచ్పల్లి కి తరలిరండి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉టీపిపీసీసీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి, మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు !


J.SURENDER KUMAR,


నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని KNR గార్డెన్స్ లో నేడు ( మంగళవారం ) జరగనున్న పార్లమెంటరి విస్తృత స్థాయి సమావేశానికి ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలిరావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.


టీపిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి , జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని KNR గార్డెన్స్ లో పార్లమెంటరి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.

నియోజకవర్గ స్థాయి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.