ధర్మపురి కేంద్రంగా టెంపుల్ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయండి !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పవిత్ర గోదావరి నది తీరానగల ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి, క్షేత్రాన్ని టెంపుల్ టూరిజం కారిడార్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు.


భోగి పండగ సందర్భంగా దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి స్వామివారి నీ దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చే సి కోడే మొక్కు చెల్లించుకున్నారు


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి, పుణ్య క్షేత్రాలను కలుపుతూ టెంపుల్ టూరిజం కారిడార్ ను ఏర్పాటు చేయాలని, ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

కారిడార్ ఏర్పాటుకు, మరియు ఈ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చర్యలు చేపట్టాలని కోరారు.