ధర్మపురిలో ముక్కోటి ఉత్సవాలకు శ్రీ పీఠం స్వామి జి కి ఆహ్వానం !

👉 తుని క్షేత్రానికి వెళ్లి ఆహ్వానించిన ఆలయ అధికారులు !


J.SURENDER KUMAR,


ఈ నెల 10 న ధర్మపురి క్షేత్రంలో జరుగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి రావలసిందిగా శ్రీ శ్రీ శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి స్వాముల వారిని ( ధర్మపురి పీఠం) ధర్మపురి ఆలయ అధికారులు ఆహ్వానించారు.


ఆదివారం “తుని” క్షేత్రంలోని వారి ఆశ్రమానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి స్వామివారి ఆశిస్సులు పొందారు. ఇట్టి కార్యక్రమంలో వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి పాల్గొన్నారు
.