ధర్మపురి లోవైభవంగా ముక్కోటి ఉత్సవాలు !


J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రాతః కాలములో వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెరిచారు.


స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్,  ముక్కోటి ఉత్సవాల  కార్యక్రమంలో పాల్గొన్నరు, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంఘీ సత్యమ్మ , పెద్దపెళ్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ దంపతులు, ఎస్పీ అశోక్ కుమార్, ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, దంపతులు ప్రముఖ ప్రవచకులు శృంగేరి స్వామి శిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.


ఆలయ వార్షిక క్యాలెండర్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఎంపీ గడ్డం వంశీ, కలెక్టర్ దంపతులు ఆవిష్కరించారు.


ప్రముఖ గాయకుడు గుండి జగదీశ్వర్ శర్మ బృందం శేషప్ప కళావేదికపై ఆలపించిన భక్తి గీతాలు భక్షజనంను మంత్రముగ్ధుల్ని చేశాయి. వేదగోష భక్తజనం పరవశించారు.
ఆలయ అధికారులు స్థానిక ఇసుక స్తంభం నుంచి భక్తులను క్యూలైన్ కు మళ్లించారు.


ఉత్తర ద్వారం వరకు ప్రత్యేక రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధర్మపురి ఆలయాలు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించడంతోపాటు ద్వారా తోరణాలు ఏర్పాటు చేశారు. పుష్పాలు విద్యుత్తు కాంతులతో ఆలయ ప్రాంగణం అపర వైకుంఠంలో విరాజిల్లింది. శుక్రవారం ఒక్కరోజు స్వామివారికి  ₹ 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది.


పురవీధులలో ఊరేగింపు!


స్వామివారి ఉత్సవ మూర్తులను పురవీధులలో (సేవ) ఊరేగించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో పాటు ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.


👉తిరుపతి సంఘటన ఎఫెక్ట్..


👉 ధర్మపురి లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్ !


👉 ప్రశాంతంగా ముగిసిన వైకుంఠ ఏకాదశి బందోబస్తు


👉 అంబులెన్స్, ఫైర్ ఇంజన్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్,. రోప్ పార్టీ పోలీస్.


వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టోకెన్ల కోసం తిరుపతి క్షేత్రంలో జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

ఇసుక స్తంభం వద్ద 108 అంబులెన్స్ లు, నంది చౌక్ వద్ద ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు రద్దీ నియంత్రణ కోసం రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో క్యూలైన్ ఏర్పాట్లను క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేపట్టారు. వీఐపీలు రాక సందర్భంగా రోప్ పార్టీ పోలీసు బృందాలు అందుబాటులో ఉంచారు.


ఎస్పీ  వెంట డిఎస్పి రఘు చందర్, ధర్మపురి  సి.ఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్.ఐ లు, ఉదయ్ కుమార్, సతీష్, ఉమ సాగర్, శ్రీధర్ రెడ్డి ఉన్నారు