ధర్మపురి నియోజకవర్గంలో నాలుగు పథకాలు ప్రారంభం !


👉లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గంలోఆదివారం రోజున ప్రజాపాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నాలుగు పథకాలను అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు సాంక్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసారు.


👉ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో..

కమలాపూర్ గ్రామంలో అర్హులైన 61 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు,142 మందికి ఇందిరమ్మ ఇళ్లు,768 మందికి 47 లక్షల రూపాయల రైతు భరోసా ను అందించారు.

👉బుగ్గారం మండలం బీర్సాని గ్రామంలో..

గ్రామంలో అర్హులైన 154 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు,88 మందికి ఇందిరమ్మ ఇళ్లు,379 మందికి 45 లక్షల 48 వేల రూపాయల రైతు భరోసా,33 మందికి రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించి సాంక్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.

👉ఎండపల్లి మండలం రాజారామ్ పల్లె గ్రామంలో..

గ్రామంలో అర్హులైన 62 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు,212 మందికి ఇందిరమ్మ ఇళ్లు 572 మందికి 38 లక్షల 58 వేల రూపాయల రైతు భరోసా,46 మందికి 2 లక్షల76 వేల రూపాయల రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించి సాంక్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా నాలుగు పథకాలను ప్రారంభించడం జరుగుతుందనీ, అందులో భాగంగా నియోజకవర్గంలో ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు.


లిస్టులో పేర్లు రానివారు ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, నా నియోజకవర్గంలో అర్థులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అమలు చేయించే బాధ్యత నేనే తీసుకుంటానని, ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి జైన గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంత సాగునీటి విషయం పైన వారితో మాట్లాడాలని అన్నారు.

అరపెల్లి నుండి రాయపట్నం వరకు లిఫ్ట్ల నిర్వహణ కూడా ప్రభుత్వమే చేపట్టాలని వారిని కోరడం జరిగిందని, వారు కూడా విషయాలపై సానుకూలంగా స్పందించారని, రైతుల సాగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.