👉 ధర్మపురి మండలం నేరెళ్లలో 30 ఎకరాల స్థలం కేటాయింపు !
👉 ఈ విద్యా సంవత్సరం నుంచి ధర్మపురిలో తరగతులు ప్రారంభం !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు సర్వే నంబర్ 252లోని 30 ఎకరాల భూమిని పాఠశాల ఏర్పాటుకు ప్రతి పాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి శనివారం నివేదిక పంపించారు.
👉 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకటే మంజూరు !
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాసంస్థ చొప్పదండి నియోజకవర్గానికి 1995-96 విద్యా సంవత్సరంలో కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసింది.
6 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థిని, విద్యార్థులకు భోజన, వసతి, డ్రెస్సులను ప్రభుత్వమే సమకూరుస్తుంది.
జాతీయ, రాష్ట్ర స్థాయి విద్య విధాన బోధన, ఈ సంస్థలో విద్యా బోధనకు ఉపాధ్యాయుల ఎంపిక విధానం జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు 70 శాతం సీట్ల ను రిజర్వ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను గతంలోనే జారీ చేసింది..
👉ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు !
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి కి 2024 జూన్ మాసంలో జవహర్ నవోదయ విద్యాలయం మంజూరుకు వినతి పత్రం ఇచ్చారు. అత్యధిక గ్రామీణ ప్రాంతాలు గల తన నియోజకవర్గానికి పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యా సంస్థల తో పాటు జవహర్ నవోదయ విద్యా సంస్థ మంజూరు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
👉రాష్ట్రానికి ఏడు విద్యాసంస్థలు మంజూరు !
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2024 డిసెంబర్ మాసంలో మంజూరు చేసిన 7 నవోదయ విద్యా సంస్థలలో జగిత్యాల జిల్లాకు ఒకటి కేటాయించిన విషయం తెలిసిందే.
👉 రాష్ట్రంలో 16 విద్యాలయాలు
తెలంగాణలో ప్రస్తుతం 9 నవోదయ పాఠశాల కొనసాగుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్లో కేటాయించిన ఏడు కలుపుకొని మొత్తం 16. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి లో ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ కేటాయించడం పట్ల అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విద్యావేత్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
👉ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు స్థలం !
ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైన సమీకృత గురుకుల పాఠశాలకు 25 ఎకరాల స్థలం పట్టణం అక్షయ పల్లె శివారులో,
వెల్గటూరు మండలం పాశిగాంలో అధికారులు స్థలం గుర్తించారు.