👉రేపు జైన గ్రామ సభలో పాల్గొననున్నారు !
J.SURENDER KUMAR,
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రేపు ధర్మపురి నియోజకవర్గానికి రానున్నారు.
ప్రజాపాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం అభ్యంతరాలు
మరియు దరఖాస్తుల స్వీకరణ కొరకు ధర్మపురి మండలం జైన గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో రేపు (తేది.22.1.2025) బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పౌరసరఫరాల,నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు,