👉 ₹ 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ !
👉 ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణలో అభివృద్ధి పనులు కొట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం వరదలా విడుదల చేస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మున్సిపాలిటీలో TUFIDC నిధుల ద్వారా మంజూరు అయినా ₹15 కోట్లకు సంబందించిన అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ లోని పలు వార్డుల్లో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎంపి వంశి క్రిష్ణ జిల్లా అదనపు కలెక్టర్, అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
👉🏻 ధర్మపురి ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి, ఒకటి పవిత్ర గోదావరిలో మురుగు నీరు కలిసి గోదావరి కలుషితం కావడం, ఫ్లడ్ వాల్ లేకపోవడం వల్ల వర్ష కాలంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురికావడం జరుగుతుంది.
👉🏻 ఇప్పటికే గోదావరిలో మురుగు నీరు కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ₹14 కోట్ల రూపాయల మంజూరుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరడం జరిగింది,.అదే విధంగా ఫ్లడ్ వాల్ ఏర్పాటు గురించి కూడా ఎంపి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

👉🏻 తలపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంత ప్రజలు త్రాగు నీటీ విషయంలో మేట్పల్లి దగ్గర ఉన్న డబ్బా పైన ఆధార పడాల్సి వస్తుంది,ఎక్కడైనా పైప్ లైన్లు మరమ్మతులు జరిగితే 2,.3 రోజుల నీరు లేక ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
👉🏻 అమృత్ స్కీమ్ ద్వారా ధర్మపురి ప్రజల త్రాగు నీటి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం,దానికి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనీ అధికారులకు సూచిస్తున్నం.
👉🏻 ధర్మపురి రైతాంగం పడుతున్న ఇబ్బందులను నేను ముఖ్యమంత్రి,ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి వారు ఒక టిఎంసి నీటిని గోదావరిలో వదిలినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
👉🏻 TUFIDC నిధుల్లో ప్రత్యేకంగా నూతనంగా కరెంట్ పోల్స్ వేయడానికి,11kv పోల్స్ తరలింపు,లైన్ల పొడిగింపు వంటి వాటికోసం ₹1కోటి 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది
👉🏻 రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా లిస్టులో పేర్లు రానివారు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు,ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు,అర్హులైన లబ్ధదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందించే బాధ్యత నేనే స్వయంగా తీసుకుంట.
👉🏻 ధర్మపురి నియోజకవర్గం లో ట్రామ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెల్లడం జరిగింది
👉🏻 మరో పది రోజుల్లో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రి లో ఐసియు ప్రారంభించేందుకు కృషి చేస్తాము
👉🏻 ఇప్పటికే ఎంపి ల్యాడ్స్ నుంచి మా నియోజకవర్గాన్ని ₹ 5 కోట్ల నిధులు వచ్చాయి, దానికి ఎంపి కి ధన్యవాదాలు తెలుపుతున్నాం, ధర్మపురి అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ఇవ్వాలని కోరుతున్నాం.
👉🏻 ధర్మపురిలో రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని,ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది
👉🏻 ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి చేగ్యం ముంపు బాధితులకు ₹ 18 కోట్ల నష్ట పరిహారం అందించడం,నైట్ కాలేజ్ పునః ప్రారంభం, నియోజకవర్గ అభివృద్ధికి NREGS, CRR, SDF, ACDP గ్రాంట్ల కింద నిధుల మంజూరు,అర్హులైన వారికి సిఎంఆర్ఎఫ్, ఎల్వోసి, కళ్యాణ లక్ష్మీ, షాది ముభరక్ చెక్కులు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది.
👉 ఈ సందర్భంగా ఎంపీ వంశి క్రిష్ణ మాట్లాడుతూ..

👉 15 కోట్ల టీయుఎఫ్ఐడిసి నిధులతో ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది.
👉 తలాపున గోదావరి ప్రవహిస్తున్న పట్టణంలో నీటిఎద్దడి సమస్య వుండడం బాధాకరం.
👉 గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు వున్న నీటిసమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయి.
👉 అమృత్ పథకం కింద ₹ 2 కోట్ల వ్యయంతో త్రాగునీటి సమస్య కోసం కేటాయిస్తున్నాం.
👉 ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నం.
👉 గతంలో ధర్మపురి గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నాం
👉 ధర్మపురి కరకట్ట నిర్మాణం పై కేంద్ర జల శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తా.
👉 ధర్మపురి ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ ల్యాండ్స్ నుండి నిధులను మంజూరు చేస్తా.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు