👉 టిటిడి జారీ చేసిన ప్రకటన లో
J.SURENDER KUMAR,
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన ముబీనా నిష్కాబేగం ఇంటిపై ఈడీ దాడులు చేసిందని సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి ప్రకటనలో ఖండించారు.
తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారి ఆలాంటి వ్యక్తి ఎప్పుడూ లేడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ కూడా టీటీడీకి సంబంధించినది కాదు. భక్తులను తప్పుదోవ పట్టించేలా, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ జారీ చేసిన ప్రకటనలో హెచ్చరించింది.