J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ వెల్గటూర్ మండలానికి చెందిన 118 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ₹ 82, 45,500/- (యెన్బయి రెండు లక్షల నలుబది ఐదు లక్షల ఐదు వందలు) చెక్ ల ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.
మండల కేంద్రంలోని VSR గార్డెన్స్ లో గురువారం ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ₹ 23 లక్షల 47 వేల 5 వందల రూపాయల విలువ గల 69 సిఎంఆర్ఎఫ్ చెక్కులను, ₹ 49 లక్షల రూపాయల విలువగల 49 కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల రాష్ట్రంగా మాకు అప్పగించడం జరిగిందని, అయినా వారు చేసిన అప్పులను తీరుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. సాగు చేస్తున్న రైతుకు భరోసా ఇచ్చే విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని, అన్నారు.

రైతులకు ఇప్పటికే ₹ 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగిందని, ఇంకా రుణమాఫీ కానీ వారు ఉంటే వారికి రుణాలను మాఫీ చేస్తామని, ఇందిరమ్మ ఇండ్లను కూడా గ్రామ సభ నిర్వహించి అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.