ఫ్లాష్ ..రైతుల పంటలకు సాగునీరు విడుదల !

👉హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం !

👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు !


J.SURENDER KUMAR,


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 24 గంటల లో శనివారం సాయంత్రం గోదావరి నదిలోకి నీటిని విడుదల చేయించారు. దీంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లకు రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు.


👉వివరాలు ఇలా ఉన్నాయి.

చేతికి అంది వచ్చిన తమ పంట పొలాలకు మరో తడి సాగునీరు అందక పంట పొలాలు ఎండి పోతాయని జగిత్యాల, ధర్మపురి, గోదావరి నది తీర రైతాంగం ఆందోళన పడ్డారు.

నీటి విడుదల కోసం మంత్రితో చర్చిస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)


ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆయా గ్రామాలలో పర్యటించి మీ పంట పొలాలకు సాగునీరు అందించే బాధ్యత మాది, ఆందోళన చెందవద్దు అని ధైర్యం చెప్పి, హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కి పరిస్థితి వివరించి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జకు ఆదేశాలు జారీ చేయించారు.


శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఒక్క టీఎంసీ నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసుకుంటున్న పంటలకు నీరు అందుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుచేసి యుద్ధ ప్రాతిపదికన నీటి విడుదల పరిస్థితి నీ ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక పంపించారు.

నీటి విడుదలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు(ఫైల్ ఫోటో)


ఈ నెల 9న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సమీక్ష నిర్వహించి తమ సమక్షంలోనే నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేయించారు.

👉 సాగునీటి సమస్య.

రైతులకు హామీ ఇస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)


సదర్మాట్ నిర్మాణంతో గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లోని గోదావరి నది తీరంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందక మరో తడికి ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందారు.


👉ఎస్సారెస్పీ నుంచి వరద కాలువలోకి


గోదావరిలోకి నీటిని తరలించేందుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువలోకి నీటి విడుదల చేశారు. వరద కాలువపై ఉన్న మూడు గేట్లను ఎత్తి వెయ్యి వేలాది క్యూసెక్కులను పెద్దవాగులోకి వదిలారు.


పెద్దవాగు ద్వారా రాయికల్ మండలం బోర్నపల్లి వద్ద గోదావరిలోకి నీరు చేరుతుంది.. ప్రస్తుతం వరద కాలువలోకి వేలాది క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 15 రోజులపాటు ఒక టీఎంసీ నీరు విడుదల కానున్నది.


👉సీఎంకు మంత్రికి కృతజ్ఞతలు !


యుద్ధ ప్రాతిపదికన స్పందించి ఒక టీఎంసీ నీటి విడుదల చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం రాత్రి ఫోన్ చేసీ కృతజ్ఞతలు తెలిపారు.