గత ప్రభుత్వ చర్యలతో నీటి ఇబ్బందులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR,

గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత చర్యలతో ధర్మపురి నియోజకవర్గ ప్రజానీకానికి సాగు తాగు నీటి ఇబ్బందులు సమస్యలు ఏర్పడ్డాయని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


గొల్లపెల్లి మండలం రంగధాముని పల్లే చెరువును గురువారం ఇరిగేషన్ అధికారులు మరియు మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.


ధర్మపురి క్షేత్రం పక్కన గోదావరి నది ఉండి, ధర్మారం మండలంలో మేడారం రిజర్వాయర్ ఉండి కూడా గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు నిర్లక్ష్యం, అనాలోచిత చర్యలతో ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రంగాధముని పల్లే చెరువు పై ఆధారపడి వెల్గటూర్, గొల్లపల్లి, పెగడపెల్లి మండలంలోని దాదాపు 20 గ్రామాలకు చెందిన 700 ఎకరాలకు పైగా అయకట్టును రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి మేడారం రిజర్వాయర్ మరియు రంగధాముని చెరువు అనేవి గుండెకాయ వంటిదని, కానీ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ విప్ గా, మంత్రి గా వ్యవహరించి ఇక్కడి ప్రాంత నీటిని సిరిసిల్ల, సిద్దిపేటకు తీసుకెళ్ళే విధంగా ఆలోచనలు చేశారు అని ఆరోపించారు.


ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రంగాధాముని పల్లె వద్ద ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి రైతులకు సాగు నీరు అందించాలన్న ఆలోచన వారు ఎన్నడూ చేయలేదన్నారు.
కాళేశ్వరం లింక్ 2 పేరుతో పెద రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు, తప్ప రైతులకు నీరు ఇవ్వలేదని, అన్నారు.


ఏ ప్రాజెక్టు కు వ్యయం ఎక్కువ అవుతుందో, కమిషన్లు ఎక్కడ వస్తాయో అక్కడే గత పాలకులు శ్రద్ధ పెట్టారని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందించే విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.