J.SURENDER KUMAR,
గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ₹ 60 కోట్లతో రోళ్ల వాగు ప్రాజెక్ట్ ను ప్రారంభించి దాన్ని ₹140 కోట్లకు అంచనాలు పెంచి రోళ్ల వాగును మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మార్చుకున్నారు అని, కమీషన్లకు ఆశపడి రి డిజైనింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడానికి తప్ప ఇట్టి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలన్న ఉద్దేశం గత ప్రభుత్వ పాలకులకు లేదని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఏ .లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
సారంగాపూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ ను గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు, అనంతరం చిన్న కొల్వాయి, జైన గ్రామాలలోని లిఫ్ట్ ప్రాజెక్టులను పరిశీలించి రైతులను వివరాలు అడిగి అధికారులతో మాట్లాడారు.

👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు మాట్లాడుతూ..
గోదావరి లిఫ్ట్ పై ఆధారపడి సుమారు 15 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగుచేయడం జరుగుతుందని, కొన్ని అనుకొని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు తమ దృష్టికి తెచ్చారు అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే రోళ్ల వాగును మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక టిఎంసి నీటినీ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, రోళ్ళ వాగు విషయంలో కూడా ఇరిగేషన్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, కాంట్రాక్టర్ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొంత సమస్య ఏర్పడిందన్నారు.

రోళ్ల వాగు ప్రాజెక్ట్ కి సంబందించిన కాంట్రాక్టర్ మరియు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఏప్రిల్, మే నెలలో వచ్చే పరిస్థితి జనవరి మొదటి వారంలోనే మనకు ఎదురు కావడం జరిగిందనీ, రైతులకు ఇబ్బందులు కలగకుండా రోళ్ల వాగు ప్రాజెక్ట్ నుండి తాత్కాలిక ప్రాతిపదికన నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ వారు సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుకు తదితరులు పాల్గొన్నారు