J.SURENDER KUMAR,
మా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ గ్రామాన గ్రామసభలలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసమే తప్ప ఈ సభలు ఓట్ల కోసం కాదు, అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలో గురువారం 13,15 వార్డుల్లో జరిగిన గ్రామసభలలో ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం అభ్యంతరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ సమస్యలు దరఖాస్తుల స్వీకరణకు గ్రామ సభలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

గత ప్రభుత్వ హయంలో ఏ ఒక్క అధికారి వచ్చి రేషన్ కార్డులను ఇస్తామని, ఇళ్లను ఇస్తామని మిటింగ్ పెట్టి ఒక్క దరఖాస్తు తీసుకోలేదని, సిఎం రేవంత్ రెడ్డి అర్హులైన పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందివ్వాలని గ్రామ గ్రామాన గ్రామ నిర్వహిస్తున్నామన్నారు,
అర్హులైన వారికి సంక్షేమ ఫలాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఉత్తం కుమార్ రెడ్డి జైన గ్రామానికి వచ్చినప్పుడు కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ, ఇళ్లను అర్హులైన పేదవారికి ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రకటించింది ఫైనల్ లిస్ట్ కాదనీ, లిస్టులో పేరు రానీ వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, తిరిగి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో కూడా దీని కొరకు కౌంటర్ చేయడం ఏర్పాటు చేశామన్నారు. నా నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేషన్ కార్డుల జారీ విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ కు చెప్పినట్టు వివరించారు.

గత పాలకుల నిర్వాకం వలన తలాపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంత ప్రజానికానికి నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపలేదని, రోడ్లు, డ్రైనేజీలు విషయంలో కూడా ఇటీవలె TUFIDC గ్రాంట్ కింద నిధులను కేటాయించడం జరిగిందనీ వాటికి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగిందని, గోదావరిలో మురుగు నీరు కలవకుండా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా సిఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.

ధర్మపురి ని రెవెన్యూ డివిజన్, బస్ డిపో, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ధర్మపురి ప్రజల అభివృదికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.
👉ఎండపల్లి మండలంలో..

ప్రజాపాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డులు,రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం అభ్యంతరాలు

మరియు దరఖాస్తుల స్వీకరణ కొరకు గురువారం ఎండపెల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ,అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు