హైదరాబాద్ లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ బిజీ బిజీ !

J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని , మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు ఇస్తూ బిజీ బిజీగా షెడ్యూల్ కొనసాగించారు.


ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గ పరిధి లో గోదావరి తీర ప్రాంతం పంటలకు సాగు నీటి విడుదల కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి పరిస్థితి వివరించారు.


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సచివాలయంలో కలసి గత ప్రభుత్వంలో రోళ్ళ. వాగు, మాతా శిశు కేంద్ర కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.


మంత్రి శ్రీధర్ బాబు ను కలసి ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ,సహకార & చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలసి సన్న వడ్ల బోనస్, హమాలీల ఛార్జీలు, నియోజకవర్గంలో అదనంగా మరి కొన్ని గోదాములు మంజూరుకు విజ్ఞప్తి చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఉద్యోగ సంఘాల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణను సీఎంతో కలిసి పాల్గొన్నవారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ తో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.