26 నుంచి రైతు భరోసా ఇస్తున్నాం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ఈ నెల 26 నుండి సాగు చేసుకున్న రైతుకు భరోసా ఇచ్చే విధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని,
రైతులకు ఇప్పటికే ₹ 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయడం జరిగిందని, కుటుంబాన్ని వదిలి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారు ఎవరైనా అక్కడే మృతి చెందితే వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ₹ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ను అందించడం జరుగుతుందనీ,
ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


బుగ్గారం మండల కేంద్రంలోనీ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ₹ 19 లక్షల 41 వేల రూపాయల విలువ గల 78 సిఎంఆర్ఎఫ్ చెక్కులను, ₹ 31 లక్షల రూపాయల విలువగల 31 కళ్యాణ లక్ష్మీ షాదిముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


అనంతరం ఇటీవల గల్ఫ్ లో మృతి చెందిన గోపులాపూర్ గ్రామానికి చెందిన గోవిందుల రవి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు అయినా ₹ 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రోసిడింగ్ కాపీని రవి కుటుంబానికి అందజేశారు.


అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..


కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నమని, గత పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి మాకు అప్పగించడం జరిగిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.


గత బి.ఆర్ ఎస్ పాలకులు గల్ఫ్ లో మృతి చెందిన వారి గురించి కనీసం పట్టించుకోలేదని, కానీ మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబాలకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఇట్టి స్కీమ్ ను అమలు చేయడం జరుగుతుందని, ఈ సంధర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.