J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామం లో ఉన్న ఇసుక రిచ్ ల ను మంగళవారం కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎమ్మార్వో తో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక డంప్ లను రెవెన్యూ , ఎడి మైనింగ్ అధికారులు కలసి118 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు.
అక్రమ ఇసుక రవాణా జరగకుండా పక్కాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేయాలని రెవెన్యూ మైనింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రిచ్ ల ద్వారా మాత్రమే ఇసుక రవాణా చేయాలని తెలిపారు. అలాగే తహసీల్దార్ ల సిబ్బంది అక్రమ ఇసుక రవాణా జరగకుండా ఎప్పటికపుడు నిఘా ఉంచాలని తెలిపారు.
అలాగే అధికారుల సమన్వయం చేసుకుంటూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు పట్టుకుని సీజ్ చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట, జిల్లా మైనింగ్ అధికారి జై సింగ్ తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.