👉 కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరి విస్తృత స్థాయి సమావేశంలో…
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పెద ప్రజల బతుకుల్లో వెలుగులు వస్తాయని, ప్రజలు ఆలోచించడం, కార్యకర్తలు కష్టపడడంతోనే ఈరోజు పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని KNR గార్డెన్స్ లో మంగళవారం జరిగిన పార్లమెంటరి విస్తృత స్థాయి సమావేశంలో టీపిపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి , జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పదవుల విషయంలో కూడా పార్టీ కోసం మొదటి నుండి కష్టపడి పని చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కార్యకర్తలకు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం సంతోషదాయకం అని ఎమ్మెల్యే అన్నారు.

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, కష్ట సుఖాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వములో అండగా ఉంటామని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు తీసుకెళ్ళే విధంగా కార్యకర్తలు కష్టపడాలని ఈ సందర్భంగా అన్నారు.