కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండ గట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు .ఈ సందర్భగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసారు.


👉అయ్యప్ప పూజలో…


గొల్లపెల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో బుధవారం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు .


👉ఎమ్మెల్యే ని కలిసిన మేరు సంఘం సభ్యులు !


ధర్మపురి పట్టణ మేరసంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా ఇటీవల నియమితులైన రాపర్తి మహేందర్ మరియు వారి కమిటీ సభ్యులు బుధవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


👉మున్నూరు కాపు క్యాలెండర్..


ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ 2025 నూతన సంవత్సరాది క్యాలెండర్ ను బుదవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలోని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు