J.SURENDER KUMAR,
క్రీడా పోటీలు అంటే గెలుపు ఓటములు సహజం అయితే కుల మతాలకు అతీతంగా క్రీడల కోటి మైదానంలో క్రీడాకారుల కలయిక పోటీలు ఆదర్శ ప్రాయామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం కమ్మరి కాని పేట గ్రామంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆదివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా టోర్నీలో విజయం సాధించిన అన్నారం జట్టుకు ₹ 30 వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అదే విధంగా రన్నరప్ గా నిలిచిన ఖమ్మర్ఖాన్ పేట జట్టుకు ₹ 15 వేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు

ఈ సందర్భంగా టోర్నీలో విజయం సాధించిన జట్టు సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడాకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.