👉 జనవరి 18, 26.ఫిబ్రవరి 3, 12 తేదీలలో..
👉టీటీడీ ఈవో శ్యామలరావు !
J. SURENDER KUMAR,
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు.
ఈఓ మాట్లాడుతూ జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో జరిగే శ్రీవారి కల్యాణాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారుల ఆదేశించారు.
ప్రయాగరాజ్ లోని శ్రీవారి దేవాలయం రోజువారీ కార్యక్రమాలపై టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఉత్తరాది నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, భక్తులకు వసతి కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాగ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వంటి ప్రధాన రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, చిన్న లడ్డూలను ఉచితంగా అందించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం, సిఇ సత్యనారాయణ, హెచ్‌డిపిపి అదనపు కార్యదర్శి రామ్‌గోపాల్, ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, విజిఓ శ్రీమతి. సదాలక్ష్మి, హెచ్‌డిపిపి కార్యదర్శి . శ్రీరామ్ రఘునాథ్, డీఈవోలు . గుణభూషణ్ రెడ్డి,. లోకనాథం తదితరులు పాల్గొన్నారు.