👉 మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
మంత్రిగారు నా ధర్మపురి నియోజకవర్గంలో 90 శాతం రైతాంగం గోదావరి నది జలాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంటలు సాగు చేసుకుంటున్నారు. రైతుల సాగునీటి సమస్యకు. శాశ్వత పరిష్కారం చెయ్యండి అంటూ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి బహిరంగ సభలో విజ్ఞప్తి చేశారు.
ప్రజాపాలన లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం అభ్యంతరాలు మరియు దరఖాస్తుల స్వీకరణ కొరకు ధర్మపురి మండలం జైన గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల,నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి,రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం , మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు, కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్, పాల్గొన్న ఈ సభకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అధ్యక్షత వహించారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

..
ధర్మపురి రైతాంగం సాగు నీటి కొరకు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి గోదావరిలోకి నీటిని విడుదల చేయడం జరిగిందని వారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఎమ్మెల్యే అన్నారు.
నియోజకవర్గంలోని యశ్వంత్ రావు పేట పెద్ద చెరువులో ఇటీవల వరదల వల్ల కొత్త పూడిక ఏర్పడిందని దాని వల్ల అట్టి చెరువు నీటి సామర్థ్యం కోల్పోవడం జరుగుతుందనీ అట్టి పూడికతితకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని దాని వల్ల 1400 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గం లోనీ ఆరెపల్లి – కొల్వాయి, దొంతపూర్, ఎడపల్లి, జైన, రాజారాం, తిమ్మాపూర్, రాయపట్నం, ముత్తునూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల కింద సుమారు 12,436 ఎకరాల సాగు చేసుకోవడం జరుగుతుందని కావున వాటి వార్షిక నిర్వహణకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని మంత్రికి వివరించారు.
👉ఎమ్మెల్యే చెప్పిన ప్రతి సమస్య పరిష్కరిస్తా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి !

విప్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి అభ్యర్థన, చెప్పిన ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకువచ్చిన వాటిని పరిష్కారంలో కృషి చేస్తాను మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
నియోజకవర్గ సాగు,త్రాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆలోచనలు చేస్తాం
👉 మంత్రికి ఘన స్వాగతం !

మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మండల యూత్ కాంగ్రెస్, NSUI, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి హెలిప్యాడ్ నుండి జైన గ్రామం వరకు దాదాపు 8 కిలోమీటర్లు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
