మంత్రి కొండా సురేఖను ఆహ్వానించిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


👉ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి…


J.SURENDER KUMAR,


దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ ను సచివాలయంలో శనివారం కలసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కు ఆహ్వానించారు.
హైదరాబాద్ సచివాలయంలో మంత్రి సురేఖను ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా ధర్మపురి ఆలయ అర్చకులు అధికారులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదాన్ని మరియు స్వామి వారి ఫోటోను మంత్రి కి అందజేసి ఈ నెల 10 న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.


👉మాతా శిశు కేంద్రంలో

మాతా శిశు కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించండి
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబందించి పలు వైద్య పరమైన అంశాలు వివరించి మీరు కేటాయించాల్సిందిగా కోరారు. మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


👉కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి తో..


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను శనివారం
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కమర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, నామినేటెడ్ పదవుల నియామకంపై చర్చించినట్లు సమాచారం.