👉చత్తీస్గడ్ ఎన్కౌంటర్ ఎఫెక్ట్
J.SURENDER KUMAR,
గతంలో మావోయిస్టు ప్రాబల్యం గల ధర్మపురి మండలం జైనా గ్రామంలో బుధవారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఛత్తీస్గడ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో పోలీసులు రెప్పవాల్చని పహారాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ స్వయానా మంత్రులు ఎమ్మెల్యేలతో కలసి సభ లో పాల్గొన్నారు.
ధర్మపురి నుంచి జైన గ్రామం వరకు రహదారి ఇరువైపుల కల్వర్టులో వద్ద సాయిద పోలీస్ బలగాలు ముహరించాయి. రోడ్డు పెట్రోలింగ్ పార్టీలు, రోప్ పార్టీలు, మహిళా కానిస్టేబుల్, మెటల్ డిక్టేటర్ లతో సభలో పాల్గొనేవారిని తనిఖీలు. చేశారు. సాయుధ జవాన్లు జనాల మధ్యనే సంచరించారు.

మంచిర్యాల్, జగిత్యాల్ సరిహద్దు గోదావరి నది తీరాన ముందస్తుగా పోలీస్ బలగాలు వలయకారంగా మోహరించాయి.

సభా ప్రాంగణానికి దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించలేదు. బుధవారం తెల్లవారుజాము నుంచే జైన గ్రామం లో సాయుధ పోలీసులు మోహరించారు. ప్రశాంతంగా మంత్రి పర్యటన ముగియడంతో పోలీసు వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.