👉 మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట తారక్క సిడం, మరో 11 మంది మావోయిస్టులు లొంగుబాటు !
J.SURENDER KUMAR,
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజు వేణుగోపాల్ భార్య తారక్క సిడం @ భారతక్క తో పాటు మరో పదకొండు మంది మావోయిస్టులు బుధవారం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు.
మహారాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న తారక్క @ భారతక్క 1983లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆమెపై దాదాపు 170 కేసు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. ఆమెపై దాదాపు రెండు కోట్ల రూపాయల రివార్డు ఉంది.
మల్లోజుల వేణుగోపాల్ స్వగ్రామం తెలంగాణలోని పెద్దపెల్లి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సోదరుడు మల్లోజు కోటేశ్వరరావు @ కిషన్ జి. (మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు) పశ్చిమ బెంగాల్ జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
భారతక్క చాలాకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నట్టు సమాచారం.ఆమెది గడిచిరోలి ప్రాంతం