ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పోరాట యోధుడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి !

J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నాకు మంచి మిత్రుడు పోరాట యోధుడు, నాపై ఒత్తిడి తెచ్చి ప్రజా పనులు చేయించుకుంటాడు అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.


👉ధర్మపురి మండలం జైన గ్రామంలో బుధవారం జరిగిన ప్రజా పాలన గ్రామసభలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్, ఎస్పీ అధికారులు పాల్గొన్నారు.


👉ఈ సందర్భంగా మంత్రి తన ప్రసంగంలో లక్ష్మణ్ కుమార్ ఓడిన గడిచిన నిరంతర పోరాట చేస్తూ గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు.


👉నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండగా 2018 ఎన్నికలలో కొందరు లక్ష్మణ్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వవద్దని ఒత్తిడి తెచ్చారన్నారు. అయినా సరే నేను లక్ష్మణ్ కుమార్ కు టికెట్ ఇచ్చాను. కొన్ని ఓట్లతో గెలిచి ఓడిన తిరిగి 2023 లో పోరాడి గెలిచారన్నారు.


👉గోదావరి నదిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీకే విడుదల నిబంధనలు అధికారులు వివరించిన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నా వద్ద కూర్చుండీ నాపై ఒత్తిడి తెచ్చి నీటీ ని విడుదల చేయించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.


👉వీరు కోరిన విధంగా జైన కొల్వాయి గోదావరి నదిలో చెక్ డ్యామ్ నిర్మాణం సాంకేతిక పరమైన అంశం అని. అయినా సంబంధిత శాఖ అధికారులతో చర్చించి తప్పక వారు వివరించిన విధంగా నిర్మాణ పనులకు చర్యలు చేపడతానని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.


👉నేను జైన గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరు పలికిన అపూర్వ ఘన స్వాగతం, ప్రేమ ఆప్యాయతలు మర్చిపోను అని ఈ ప్రాంతం రైతాంగానికి శాశ్వత సాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది అని మంత్రి ఈ సందర్భంగా సభాముఖంగా ప్రకటించారు. మంత్రి ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.