J.SURENDER KUMAR,
పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో వారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి 74 కిలోల కేక్ కట్ చేసి తినిపించారు.

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదం శేష వస్త్రం మరియు స్వామి వారి చిత్ర పటాన్ని జీవన్ రెడ్డికి అందజేశారు.
జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తధాతలకు ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షాలు వారి పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.