👉ధర్మపురి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శైలి..
J.SURENDER KUMAR,
వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమతో ముడిపడి ఉన్న వ్యాపారం ఆయనది. రాజకీయ జీవితంలో కీలక నామినేటెడ్ పదవి వచ్చిన దశాబ్దాలుగా తాను నిర్వహిస్తున్న పాల వ్యాపారంను ఆ నాయకుడు విడవలేదు. అర్ధాంతంగా వచ్చి పోయే పదవుల కన్నా అందరిలో ఒకడిగా ఉంటూ, నామినేటెడ్ పదవి బాధ్యతలు నిర్వహిస్తూ పాల వ్యాపారం కొనసాగిస్తున్న సంగ నర్సింగ్ యాదవ్ జీవన శైలి .

ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి చెందిన సంఘ నరసింహులు @ దోనూరు నరసింహులు కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ఆయనకు ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక వైస్ చైర్మన్ పదవి కి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నామినేట్ చేశారు
నరసింహులు ది వ్యవసాయ కుటుంబం, కులవృత్తి గొర్రెలు , మేకల పెంపకం, గత పది సంవత్సరాలుగా దోనూరు, తీగల ధర్మారం, పునరాస గ్రామాలలో, పాలను కొనుగోలు చేసి ధర్మపురి పట్టణంలో ఇంటింటికి తిరిగి (పాలవాడకం) విక్రయిస్తుంటాడు. దాదాపు 50, 60 లీటర్లు పాలడబ్బాల ను ద్విచక్ర వాహనం ద్వారా పట్టణానికి తెచ్చి అమ్ముతుంటాడు.

కీలక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవికి నామినేటెడ్ అయినా, తన పాల విక్రయ వృత్తిని బంద్ చేయకపోవడంతో, కొందరు యువకులలో నరసింహులు వృత్తి స్ఫూర్తిని నింపింది గా చర్చ నెలకొంది.

స్వర్గీయ దేవాదాయ శాఖ మాజీ మంత్రి రత్నాకర్ రావు హాయంలో ధర్మపురి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడిగా నరసింహులు కొన్ని రోజులు కొనసాగాడు. వచ్చి పోయే పదవుల కన్నా ప్రజలతో మమేకమై జీవించడమే తనకు ఇష్టమని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహులు అన్నారు.