J.SURENDER KUMAR,
పెద్దపల్లి జిల్లాకు గుంజెపడుగు గ్రామానికి చెందిన న్యాయవాది దంపతుల హత్య కేసు ను సీబీఐ విచారణకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాది గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ తండ్రి కిషన్ రావు 2021 సెప్టెంబర్ లో 18 వినతి పత్రం ఇచ్చారు.
న్యాయవాద ఆ దంపతులను పెద్దపల్లి మంథని నడిరోడ్డుపై పట్టపగలు కారు నుంచి లాగి వందలాదిమంది చూస్తుండగా అతి పా షావికంగా నరికి హతమార్చిన విషయం తెలిసిందే. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమగ్ర దర్యాప్తు వామన్ రావు తండ్రి కిషన్ రావు పిటిషన్ లో పేర్కొన్నట్టు సమాచారం.

ఈ కేసును.సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని అప్పటి తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారని, కానీ దాన్ని అమలు పరచలేదని. న్యాయవాది వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.