పద్మ అవార్డుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం శుభాకాంక్షలు !

J.SURENDER KUMAR,


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్‌, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన ప్ర‌ముఖుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అభినంద‌న‌లు తెలిపారు.


వైద్య‌రంగంలో విశేష సేవ‌లు అందించిన డాక్ట‌ర్ డి. నాగేశ్వ‌ర్‌రెడ్డి కి ప‌ద్మ‌విభూష‌ణ్‌, సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌ కు ప‌ద్మ భూష‌ణ్‌,

ప్ర‌జా వ్య‌వ‌హారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ‌,

క‌ళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ‌  మాడుగుల నాగ‌ఫ‌ణిశ‌ర్మ‌ , దివంగ‌త మిర్యాల అప్పారావు  రాఘ‌వేంద్రాచార్య పంచ‌ముఖి గార్లకు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్క‌డంపై ముఖ్య‌మంత్రి  హ‌ర్షం వ్య‌క్తం చేశారు.


తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి.. అంకిత‌భావమే వారు దేశంలో ఉన్న‌త పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యేందుకు కార‌ణ‌మ‌య్యాయ‌ని ముఖ్య‌మంత్రి  పేర్కొన్నారు.