పంటలకు సాగునీరు అందుతుంది !

J.SURENDER KUMAR,

ధర్మపురి జగిత్యాల్ నియోజకవర్గ పరిధి గోదావరి నది తీరా పంట పొలాలకు సాగునీరు అందుతుంది. బుధవారం బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు పంట పొలాలకు అందుతున్నది.

గోదావరి నదిలో నీరు లేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతాంగం తమ పరిస్థితిని ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వివరించారు.

దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సారెస్పీ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేయించిన విషయం తెలిసిందే. పంటలకు సాగునీరు అనడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నరు.