ప్రతిభకు కేంద్ర ప్రభుత్వ పట్టాభిషేకం !

👉 మెట్టుపల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ !


J.SURENDER KUMAR,


విధి నిర్వహణలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పోలీస్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక చేసింది.

👉 వివరాలు ఇలా ఉన్నాయి.

సీఐ నిరంజన్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి విధి నిర్వహణలో అసమాన ధైర్యసహసాల ప్రదర్శించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిరంజన్ రెడ్డి సేవలను గుర్తించింది.

👉 1989 సం లొ కానిస్టేబుల్ గా ఎంపిక.

👉 1990 లో కానిస్టేబుల్ గా జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్, తీవ్రవాద వ్యతిరేఖ పోరాటంలో పలు ఎదురు కాల్పులలో పాల్గొనడం జరిగింది.

👉 1992 అక్టోబర్ లో హెడ్ కానిస్టేబుల్ గా అగ్జిలరీ ప్రమోషన్ !

👉 1993 హెడ్ కానిస్టేబుల్ గా సిరిసిల్లాలో అక్కడ కూడా నక్సలైట్లకు వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది.

👉 1994 లో ముఖ్యమంత్రి సేవ పథకం

👉 2000 లో ASI గా పదోన్నతి.

👉 2012 లో SI గా పదోన్నతి.

👉 2013 లో గొల్లపల్లి SI గా

👉 2016 లో కథలాపూర్ SI గా .

👉 2023 లో CI గా అగ్జిల్లరి ప్రమోషన్

👉 ఇప్పటివరకు 1- ముఖ్యమంత్రి సేవ పథకం

👉 Cash – రివార్డులు – 54

👉 GSE లు – 49

👉 ప్రశంసా పతములు – 32

👉ఎస్పీ అభినందనలు.

విధినిర్వహణలో కష్టించి పనిచేసే పోలీస్‌ అధికారులకు గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కి ఎంపిక అయన మెట్ పల్లి సి.ఐ ని ఎస్పీ అభినందించారు.